గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 15:18:14

పొలంలోకి భారీ మొసలి..

పొలంలోకి భారీ మొసలి..

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ వడోదరలోని ఓ ఊరి ప్రజలను మొసళ్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద నదుల్లో కనిపించే మొసళ్లు పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికీ ఏడు సార్లు పొలాల్లోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. వడోదరాలోని కేలన్పూర్‌ గ్రామంలో శనివారం ఏడడుగుల భారీ మొసలి కనిపించింది. గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ బృందం చాకచక్యంగా మొసలిని బంధించి, గుజరాత్‌ అటవీశాఖ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘మై వడోదరా’ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రెస్క్యూ టీంలోని సభ్యుడు మాట్లాడుతూ ‘మొసలి రావడంపై కేలన్పూర్ గ్రామం నుంచి మాకు కాల్ వచ్చింది. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, పొలంలో మొసలి దొరికింది. మేము దాన్ని రక్షించి.. పునరావాసం కోసం గుజరాత్ అటవీ శాఖకు అప్పగించాం’, అని చెప్పారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo