ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 13:50:34

కాడిలా ఫార్మాలో కరోనా కలకలం.. 26 మందికి పాజిటివ్‌

కాడిలా ఫార్మాలో కరోనా కలకలం.. 26 మందికి పాజిటివ్‌

అహ్మదాబాద్‌ : ఫార్మా కంపెనీలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. అహ్మదాబాద్‌లోని కాడిలా ఫార్మా కంపెనీలో కరోనా కలకలం సృష్టించింది. ఈ కంపెనీలో పని చేస్తున్న 26 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కంపెనీని మూసివేసి శానిటైజ్‌ చేస్తున్నారు. ఆరు రోజుల క్రితం ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఫార్మా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో మిగతా ఉద్యోగుల శాంపిల్స్‌ను సేకరించి.. పరీక్షలు నిర్వహించగా మరో 21 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం 95 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా కేసులు అధికంగా నమోదు అయ్యాయి. 


logo