సోమవారం 06 జూలై 2020
National - May 30, 2020 , 03:53:54

ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకే పరీక్షలు!: రమేశ్‌ పొఖ్రియాల్‌

ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకే పరీక్షలు!: రమేశ్‌  పొఖ్రియాల్‌

న్యూఢిల్లీ: యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకే పరీక్షలు జరుగుతాయని కేంద్ర మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులను ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పై తరగతికి ప్రమోట్‌ చేస్తారని, రెండో సంవత్సరం విద్యార్థులను ప్రస్తుత ఇంటర్నల్‌ మార్కులు, గతేడాది జరిగిన పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకొని మూడో సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తారని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఎక్కడైతే పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉన్నదో అక్కడే ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు.  దేశంలోని యూనివర్సిటీల వీసీలు, విభాగాల అధిపతులతో వెబినార్‌ నిర్వహించిన ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తప్పనిసరిగా నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.


logo