గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 11:44:56

పరీక్షల మార్గదర్శకాలు మరోసారి పరిశీలించండి

పరీక్షల మార్గదర్శకాలు మరోసారి పరిశీలించండి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి విడుదలచేసిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ సూచించారు. ఇంటర్మీడియట్‌, సెమిస్టర్‌, అకడమిక్‌ క్యాలెండర్‌ కోసం ఇప్పటికే జారీచేసిన మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని యూజీసి సలహా ఇచ్చానని మంత్రి చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను రూపొందించాలని తెలిపారు.     

కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడిన పది, 12వ తరగతి పరీక్షలను రద్దుచేయాలని సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుని, ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పరీక్షల మార్గదర్శకాలను పునఃపరిశీలించాలని యూజీసీకి సూచిస్తూ ట్వీట్‌ చేశారు. 


logo