ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 17:03:28

విశాఖ దుర్ఘ‌ట‌న‌: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు హెచ్చార్సీ నోటీసులు

విశాఖ దుర్ఘ‌ట‌న‌: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు హెచ్చార్సీ నోటీసులు

అమ‌రావ‌తి: ‌విశాఖ‌ప‌ట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనకు కార‌ణాలతోపాటు పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేయాల‌ని క‌మిష‌న్ ఆ నోటీసుల‌లో ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీల స‌హానీ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. గ్యాస్ లీకేజీ, ఆ తర్వాత పరిణామాలను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. 


logo