కంగనా ఆఫీస్ కూల్చివేత కేసు.. బీఎంసీకి హెచ్ఆర్సీ సమన్లు

ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత కేసులో మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు షాకిచ్చింది. తన ఎదుట హాజరు కావాలంటూ బుధవారం కమిషనర్, ఐఏఎస్ చాహాల్‌కు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ముంబై పాలిహిల్స్ ప్రాంతంలో ఉన్న కంగనా రనౌత్‌కు సంబంధించిన కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కొంత భాగాన్ని కూల్చివేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కూల్చివేసింది. ఈ విషయమై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కూల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది.
అప్పటికే కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. తనకు రూ.2కోట్ల పరిహారం ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ సందర్భంగా బీఎంసీని కోర్టు మందలించింది. నష్టాన్ని నిర్ధారించేందుకు ఓ సర్వేయర్‌ను నియమించాలని ఆదేశిస్తూ.. వచ్చే ఏడాది మార్చిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దెబ్బతిన్న కార్యాలయాన్ని తిరిగి క్రమబద్ధీకరించాలని బీఎంసీకి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన వాదోపవాదాల అనంతరం కోర్టు తీర్పును వెలవరించింది. అనంతరం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఎంసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కంగనాను బెదిరించే ఉద్దేశంతోనే ఇదంతా చేశారని కోర్టు అభిప్రాయపడింది. పరిహారం చెల్లించాలని, ఈ మేరకు నష్టాన్ని కార్యాలయంలో మదింపు చేయాలని, ఈ విషయంలో కంగనా, బీఎంసీ ఇద్దరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
తాజావార్తలు
- యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
- సైకోను పట్టించిన సీసీ కెమెరా
- సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం
- వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం
- చిన్ని మెదడుకు పెద్ద కష్టం
- ‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్ పుణ్యమే
- మంద మెరిసె.. మది మురిసె
- డే1సక్సెస్
- మన శాస్త్రవేత్తల కృషితోనే వ్యాక్సిన్ : గుత్తా