బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 11:30:09

స్విమ్మింగ్ పోటీలో చీటింగ్‌.. ఇలా చేసి కూడా గెల‌వ‌చ్చా?

స్విమ్మింగ్ పోటీలో చీటింగ్‌.. ఇలా చేసి కూడా గెల‌వ‌చ్చా?

స్విమ్మింగ్ పోటీలో నెగ్గుకురావాలంటే బాగా ఈత కొట్టాలి. అంద‌రిక‌న్నా స్పీడ్‌గా ముందుకు వెళ్లాలి. అయితే ఈ పోటీలో స్విమ్మింగ్ ఒక‌టే వ‌స్తే స‌రిపోదు. ర‌న్నింగ్ కూడా వ‌చ్చి ఉండాలి. లేదంటే ఓడిపోతారు. అదేంటి స్విమ్మింగ్‌కు ర‌న్నింగ్‌తో ప‌నేంటి అనుకుంటున్నారా? ఈ కాంపిటేష‌న్ అంతే మ‌రి. ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

సాధార‌ణంగానే స్విమ్మింగ్ పోటీ మొద‌లైంది. అయితే ఇందు‌లో ఇద్ద‌రు మాత్ర‌మే పార్టిసిపేట్ చేశారు. స్వీడ్‌గా వెళ్లేందుకు చాలామంది నీటిలోనే వెళ్తారు క‌దా.. అలా ఒక అత‌ను త‌ల నీటి లోప‌ల పెట్టి స్విమ్ చేస్తున్నాడు.  రెండో వ్య‌క్తి మాత్రం కాస్త దూరం వెళ్లిన త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చేస్తాడు. అలా కొంచెం దూరం ప‌రుగెత్తి నీటిలో దూకి స్విమ్మింగ్ చేసిన‌ట్లుగానే చీట్ చేశాడు. అత‌డు అలా చేసిన సంగ‌తి పోటీదారుడుకు త‌ప్ప అంద‌రికీ తెలుసు. మ‌రి ఇది గేమ్ రూల్?  లేకుంటే చీటింగ్ అన్న‌ స‌న్నిగ్దంలో నెటిజ‌న్లు ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. logo