గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 19:50:11

పామును అవ‌లీల‌గా ప‌ట్టుకున్న పూజారి.. ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నారో!

పామును అవ‌లీల‌గా ప‌ట్టుకున్న పూజారి.. ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నారో!

పామును చూస్తేనే హ‌డ‌లిపోతారు. అలాంటిది క‌ర్ర‌తో కొట్టాల‌న్నా కూడా భ‌య‌ప‌డి ప‌రుగులు తీస్తారు. ఎంతో అమాయ‌కంగా క‌నిపించే పూజారి శిక్ష‌ణ తీసుకున్న మ‌నిషిలా పామును అమాంతం ప‌ట్టేసుకున్నాడు. దీనికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. పూజారి ఎక్క‌డా భ‌య‌ప‌డుతున్న‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. చిన్న క‌ర్ర‌పుల్ల‌తో పామును బంధించేశాడు.

క‌ర్ణాట‌క‌లోని ఉడిపీకి చెందిన పెజావ‌ర్ స్వామీజీ పామును ప‌ట్టుకునే విధానం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలో పూజారి కొబ్బ‌రి పుల్ల‌ను తీసుకొని స‌న్న‌గా ఉండే భాగాన్ని ముడిలా బిగించి పామును ప‌ట్టేసుకున్నాడు. చేప‌ల‌కు గాల‌మేసిన‌ట్లుగా పాముని అలా ఎలా ప‌ట్టుకున్నారంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. logo