సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 15:47:41

ముద్ర లోన్ కు ఎలా అప్లై చేయాలి...?

ముద్ర లోన్ కు ఎలా అప్లై చేయాలి...?

ఢిల్లీ :కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఉపాధి మార్గాన్ని వెతుక్కోవాలని భావించే వారికి మోదీ సర్కారు అందించే "ముద్ర లోన్" ఎంతో ప్రయోజనం కలుగనున్నది. ముద్ర లోన్ ద్వారా మీరు మీ వ్యాపారం కోసం రూ .10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం (పీఎంఎం వై)తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మలుచుకోవచ్చు. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వెండార్స్, వ్యాపారులు, దుకాణదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం...

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం (పీఎంఎం వై)తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మల్చుకోవచ్చు. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వెండార్స్, వ్యాపారులు, దుకాణదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పీఎం ముద్ర యోజన పథకం కింద బ్యాంకులు మంజూరు చేసే ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి.

మొదటిది శిశు లోన్ ( రూ 50, 000 వరకు రుణం ) కాగా రెండోది కిషోర్ లోన్ ( రూ. 50,002 నుంచి రూ.5 లక్షల వరకు ) అని పిలుస్తారు. ఇక మూడవ రకం లోన్ విషయానికొస్తే.. తరుణ్ లోన్‌ స్కీమ్‌గా పిలిచే ఈ ముద్ర రుణం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులను నేరుగా ఆశ్రయించి అక్కడైనా ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ ద్వారా  https://www.mudra.org.in కూడా ముద్ర లోన్‌కు దరఖాస్తు చేయవచ్చు.

-ముద్ర లోన్ కింద రుణం పొందడానికి ఎటువంటి సెక్యురిటీ అవసరం లేదు. థర్డ్ పార్టీ నుంచి సెక్యురిటీ లాంటివి ఏవీ అవసరం లేకుండానే ముద్ర లోన్ పొందవచ్చు. 

-ముద్ర లోన్‌కి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికొస్తే.. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్, ఓటర్ ఐడి, ప్యాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి కార్డులు ఉపయోగించుకోవచ్చు.

-అడ్రస్ ప్రూఫ్.. ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ వంటివి సమర్పించవచ్చు. ఏ వ్యాపారం కోసమైతే రుణం తీసుకోవాలని భావిస్తున్నారో.. అందుకు సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపించాల్సి ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.