ఆదివారం 17 జనవరి 2021
National - Nov 26, 2020 , 00:06:30

ఆధార్‌.. మరింత సులభం

ఆధార్‌.. మరింత సులభం

  • పీవీసీ కార్డు కోసం
  • ఏ మొబైల్‌ నంబర్‌ అయినా ఓకే

న్యూఢిల్లీ: యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ కార్డును.. డెబిట్‌ కార్డు సైజులో ఉన్న పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ) కార్డు రూపంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లున్న ఈ కార్డు కోసం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో పనిలేదని, ఓటీపీ కోసం ఏ మొబైల్‌ నంబర్‌ను ఇచ్చినా సరిపోతుందని యూఐడీఏఐ తాజాగా పేర్కొంది. ఈ కార్డు కోసం రూ.50ను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఐదు రోజుల్లో పీవీసీ కార్డు స్పీడ్‌ పోస్టులో ఇంటికే వస్తుంది. 

ఆధార్‌ పీవీసీ కార్డుకు దరఖాస్తు చేసే విధానం:

  • యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ‘http://uidai.gov.in/’లోకి లాగిన్‌ అవ్వాలి.
  • ‘మై ఆధార్‌' సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ‘గెట్‌ ఆధార్‌ సెక్షన్‌'లో ఉన్న ‘ఆర్డర్‌ ఆధార్‌ పీవీసీ కార్డ్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • 12 అంకెల ఆధార్‌ సంఖ్య లేదా 16 అంకెల వర్చువల్‌ ఐడీ లేదా 28 అంకెల ఈఐడీని నమోదు చేయాలి.
  • సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ కావాలో లేదా ఇతర నంబర్‌కు ఓటీపీ కావాలో ఎంచుకోవాలి. ఇతర నంబర్‌కు ఓటీపీ కోసం ‘మై మొబైల్‌ నంబర్‌ ఇజ్‌ నాట్‌ రిజిస్టర్డ్‌'అనే బాక్సుపై క్లిక్‌ చేయాలి.
  • ఎంచుకున్న మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
  • పేమెంట్‌ గేట్‌వే ద్వారా నిర్ణీత రుసుమును చెల్లించాలి.