ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 19:04:20

ఢిల్లీలో నేడు ఎన్ని కేసులంటే..?

ఢిల్లీలో నేడు ఎన్ని కేసులంటే..?

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.  నిత్యం ప్రజాప్రతినిధులు, నాయకులతో కళకళలాడే దేశ రాజధాని ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. కరోనా మహమ్మారి అక్కడ భారీగా విస్తరిస్తుండడంతో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. 

నేడు కొత్తగా 2889 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాకుండా 65 మంది మరణించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 83077కు చేరుకోగా.. వీటిలో 52607 మంది డిశ్చార్జి అయ్యారు. 27847 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 2623 మంది కరోనాతో మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.


logo