శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 20:18:03

ఇంకెంత కాలం దూరం పెడుతారు: ప‌్రధాని మోదీ

ఇంకెంత కాలం దూరం పెడుతారు: ప‌్రధాని మోదీ

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను నిర్ణయాధికారాలున్న ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో భాగం చేయాలని ప్రధాని న‌రేంద్ర‌మోదీ డిమాండ్ చేశారు. భార‌త్‌ ఇంకెంత కాలం ఐక్యరాజ్య‌స‌మితి‌కి దూరంగా ఉండాలని ప్ర‌ధాని సూటిగా ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి సాధార‌ణ స‌భ‌ 75వ సెషన్‌లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్నిఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు.

భద్రతామండలిని విస్తరిస్తూ ఐరాస‌లో సంస్కరణలు తీసుకురావడానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో చోటుచేసుకునే ఏ మార్పైనా ప్రపంచంపై ప్రభావం చూపుతుంద‌ని, అయినా భార‌త్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితిలో త‌గిన భాగ‌స్వామ్యం లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఐక్యరాజ్య సమితి బలోపేతం కావడం, సుస్థిరత సాధించడం ప్రపంచ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమని మోదీ అభిప్రాయ‌ప‌డ్దారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.