గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 20:24:04

టూరిజం,హాస్పిటాలిటీ రంగాల పరిస్థితి గతేడాదితో పోలిస్తే ఎలా ఉందంటే...?

టూరిజం,హాస్పిటాలిటీ రంగాల పరిస్థితి గతేడాదితో పోలిస్తే ఎలా ఉందంటే...?

ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పలు రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. మే,ఆగస్టు నెలల మధ్య అభ్యర్థులు ఉద్యోగాల కోసం వెతకడం 30 శాతం పెరిగిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా మన దేశంలో ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో ఉద్యోగాన్వేషణ పుంజుకుందని వెల్లడించింది. ఈ రంగాల్లో ఉద్యోగ ప్రకటనలు ఏడాది క్రితంతో పోలిస్తే మే నెలలో 69 శాతం తగ్గాయి. అదే సమయంలో గత ఏడాది సెప్టెంబర్ కంటే ఈసారి 58 శాతమే తగ్గాయి. అంటే క్రమంగా కోలుకుంటున్నట్లుగా భావించవచ్చు.

ఇండీడ్ వెబ్‌సైట్ మే, ఆగస్టుల మధ్య వచ్చిన ఉద్యోగ ప్రకటనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. గత ఏడాది నెలలతో ఈసారి నెలల వారీగా ఉద్యోగ ప్రకటనలు పెరుగుతున్నప్పటికీ, క్షీణత మాత్రం ఉందని వెల్లడించింది. మే-ఆగస్ట్ కాలంలో ఉద్యోగ ప్రకటనలు 21 శాతం మేర క్షీణించాయి. 2020 మే - ఆగస్ట్ మధ్య ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం 30 శాతం పెరిగింది. భారత్‌లో ఆతిథ్యం, పర్యాటకరంగాల్లో క్రమంగా ఉద్యోగాలు పెరుగుతున్నాయని తెలిపింది. మే - ఆఘస్ట్ మధ్య వచ్చిన ఉద్యోగ ప్రకటనల ఆధారంగా ఇండీడ్ ఈ నివేదికను రూపొందించింది.

2019తో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో (మార్చి-ఆగస్ట్) మధ్య జాబ్ పోస్టింగ్స్ 49 శాతం మేర తగ్గినట్లు ఇండీడ్ నివేదిక తెలిపింది. 2019 ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈ ఆగస్ట్‌లో పోస్టింగ్స్ 56 శాతం మేర క్షీణించాయి. జాబ్ సెర్చింగ్స్ 44 శాతం మేర తగ్గాయి. టూరిజం రంగంలో లాక్ డౌన్ సమయం నుండి జాబ్ సెర్చింగ్స్ 45 శాతం మేర తగ్గినట్లు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో మే నెల నుండి క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.  కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక, ఆతిథ్య, విమానయాన రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. పర్యాటక రంగానికి సంబంధించి దేశంలో ప్రతి ఎనిమిది ఉద్యోగాల్లో ఒకటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఎంతో దోహదపడుతుందని ఇండీడ్ మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo