ఆదివారం 24 జనవరి 2021
National - Dec 02, 2020 , 17:31:41

నీచ రాజ‌కీయాలు ఎందుకు.. పంజాబ్ సీఎంపై కేజ్రివాల్ ఫైర్‌

నీచ రాజ‌కీయాలు ఎందుకు.. పంజాబ్ సీఎంపై కేజ్రివాల్ ఫైర్‌

న్యూఢిల్లీ: ‌కేంద్రం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేక రైతులు చేప‌ట్టిన ఆందోళ‌న పంజాబ్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది. రైతుల ఆందోళ‌న‌కు అడ్డు త‌గిలేలా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ న‌ల్ల చ‌ట్టాలు చేశార‌ని పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ విమ‌ర్శించ‌గా.. ప్ర‌స్తుతం నెల‌కొన్న సున్నిత ప‌రిస్థితుల్లో అమ‌రీంద‌ర్‌సింగ్ ఎలా నీచ రాజ‌కీయాలు చేయగలుగుతున్నార‌ని కేజ్రివాల్ మండిప‌డ్డారు. 

'పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్‌సింగ్ నేను ఢిల్లీలో న‌ల్లచ‌ట్టాలు పాస్ చేశాన‌ని ఆరోపిస్తున్నారు. ఇంతటి సున్నిత‌మైన ప‌రిస్థితుల్లో కూడా ఆయ‌న ఎలా నీచ రాజ‌కీయాలు చేయ‌గ‌లుగుతున్నారు. ఢిల్లీలోని స్టేడియాల‌ను తాత్కాలిక‌ జైల్లుగా మార్చాల‌న్న కేంద్రం ప్ర‌య‌త్నాల‌కు నేను అడ్డుచెప్పినందుకే కెప్టెన్ ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌పిస్తున్న‌ది. స్టేడియాల‌ను జైళ్లుగా మార్చేందుకు నేను అంగీక‌రిస్తే.. ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను కేంద్రం జైల్లలో పెట్టేది. దాంతో పంజాబ్ సీఎంకు కేంద్రంపై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం దొరికేది. ఇప్పుడా అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయ‌న నిరుత్సాహ ప‌డుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది' అని కేజ్రివాల్ పేర్కొన్నారు. ‌   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo