శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 15:50:14

ఢిల్లీలో కుండపోత.. డ్రైనేజీలో కొట్టుకుపోయిన ఇళ్లు: వీడియో

ఢిల్లీలో కుండపోత.. డ్రైనేజీలో కొట్టుకుపోయిన ఇళ్లు: వీడియో

ఢిల్లీ : దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ఈ ఉద‌యం భారీ వ‌ర్షాలు కురిశాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప‌లు ప్రధాన రోడ్లపై భారీఎత్తున నీరు నిలిచిపోయింది. ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షానికి ఐటిఓ ప్రాంతంలోని ఓ మురికివాడ వద్ద ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది. వ‌ర‌ద నీటి ప్ర‌వాహానికి మురికి కాలువ ఉప్పొంగి ప్ర‌హ‌హించింది. పొంగిపొర్లుతున్న మురుగునీటి కాలువ ప్ర‌వాహా ప్ర‌భావానికి ఓ ఇళ్లు క్ష‌ణ‌కాలంలో కూలిపోయి వ‌ర‌ద నీటిలో క‌లిసిపోయింది. ఘ‌ట‌న స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం తప్పింది. 

సంఘ‌ట‌నా స్థ‌లానికి క్యాట్స్, ఫైర్ ఇంజన్లు చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించాయి. మ‌రొక ఘ‌ట‌న‌లో అదే ప్రాంతంలో మురుగుకాల్వ అంచున ఉన్న ఓ ఇటుక‌ల ఇళ్లు కూలిపోయి శిథిలాలుగా మిగిలింది. ఐకానిక్ మింటో వంతెన కింద రహదారి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. మరణించిన వ్యక్తిని చండీగఢ్‌కు చెందిన కుందన్‌ (56)గా గుర్తించారు. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వానలు కురిసినట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.


logo