ఆదివారం 20 సెప్టెంబర్ 2020
National - Jul 05, 2020 , 17:19:00

సాయంత్రం పెండ్లి.. మ‌ధ్యాహ్నం పెండ్లికూతురు దారుణ‌హ‌త్య‌

సాయంత్రం పెండ్లి.. మ‌ధ్యాహ్నం పెండ్లికూతురు దారుణ‌హ‌త్య‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోరం జరిగింది. పెండ్లికి కొన్ని గంట‌ల ముందు పెండ్లి కూతురు దారుణ‌హ‌త్యకు గురయ్యింది. పెండ్లి మేక‌ప్ కోసం త‌న సోద‌రితో క‌లిసి బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లిన యువ‌తిని ఓ యువ‌కుడు క‌త్తితో మెడ‌కోసి దారుణంగా హ‌త్య‌చేశాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ర‌త్లామ్ జిల్లా జ‌వోరా గ్రామంలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. హ‌త్య గురించిన‌ స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నిందితుడు క‌త్తితో బ్యూటీ పార్ల‌ర్‌లో చొర‌బ‌డ్డాడని, ఏం జ‌రుగుతుందో అర్థ‌మ‌య్యేలోపే త‌న సోద‌రి గొంతు కోసి పారిపోయాడ‌ని హ‌తురాలి సోద‌రి తెలిపింది. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘ‌ట‌నా ప్రాంతం నుంచి సేక‌రించిన కొన్ని క్లూస్ ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo