బుధవారం 08 జూలై 2020
National - Jun 06, 2020 , 16:18:11

నిబంధనలు పాటిస్తూ హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు....

నిబంధనలు పాటిస్తూ హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు....

బెంగుళూరు: హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరవడానికి అనుమతిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్యూరప్ప అన్నారు, అయితే కరోనా వైరస్‌ రాకుండా కేంద్రం నిర్దేశించిన ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి శుక్రవారం పర్యాటక, రవాణా శాఖలతో పాటు స్టాక్‌ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తామని హోటళ్ల సంఘాలు, రవాణా సంస్థలు చెప్పాయని అధికారిక పత్రికా ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. మతపరమైన ప్రార్థనా స్థలాలు, షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలను జూన్‌ 8 న ప్రారంభించడంపై కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

సమావేశంలో బస్సులు, హోటళ్లు, టాక్సీ యజమానుల సంఘం కొన్ని డిమాండ్లను తమ ముందు ఉంచాయని, వారి డిమాండ్లను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని యడ్యూరప్ప తెలిపారు. పర్యాటక శాఖ హోటళ్లు, అతిథి గృహాలు, పర్యాటక ప్రదేశాలను ప్రారంభిస్తున్నందున పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.


logo