శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 02:21:53

హోటల్‌ బిల్లు రూ.20 వేలు దాటితే పన్ను మోత

హోటల్‌ బిల్లు రూ.20 వేలు దాటితే పన్ను మోత

న్యూఢిల్లీ: పన్నుల ఎగవేతను అరికట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా కొన్ని రకాల వైట్‌ గూడ్స్‌ కొనుగోళ్లతోపాటు ఆస్తి పన్ను, మెడికల్‌, జీవిత బీమా, హోటల్‌ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీల పరిమితిని తగ్గించి పన్నుల పరిధిని మరింత పెంచాలని ప్రతిపాదించింది. దీంతో ఇకపై మీ హోటల్‌ బిల్లు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు రూ.20 వేలు దాటినా, జీవిత బీమాకు రూ.50 వేలు మించి ఖర్చు చేసినా, స్కూల్‌ ఫీజుకు, లేదా వైట్‌ గూడ్స్‌, ఆభరణాలు, మార్బుల్స్‌, పెయింటింగ్స్‌ లాంటి కొనుగోళ్ల కోసం లక్ష రూపాయలకు మించి వెచ్చించినా మీరు చెల్లింపులు జరిపిన సంస్థ ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అలాగే ఆస్తి పన్ను చెల్లింపు రూ.20 వేలకు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు రూ.20 వేలకు మించితే ఆ వివరాలు కూడా ప్రభుత్వానికి అందుతాయని, ఇవన్నీ సదరు వ్యక్తి పన్ను చెల్లింపు స్టేట్‌మెంట్‌ (ఫామ్‌ 26 ఏఎస్‌)లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో అధిక విలువ కలిగిన లావాదేవీల్లో ఎక్కువ భాగం బ్యాంకులు లేదా డీమ్యాట్‌ ఖాతాలకు అనుసంధానమై ఉండేవి. కానీ ప్రస్తుతం పన్ను వసూళ్లలో ప్రతి ఒక్కరిపై దృష్టిసారించాలన్న లక్ష్యంతో కేంద్రం తాజా ప్రతిపాదన చేసింది. 


logo