బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 17:53:10

దవాఖానలు పరిశుభ్రంగా ఉండాలి : సీఎం యోగి

దవాఖానలు పరిశుభ్రంగా ఉండాలి : సీఎం యోగి

బలరాంపూర్‌ : ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో దవాఖానలను పరిశుభ్రంగా ఉంచాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం ఆయన బలరాంపూర్‌ జిల్లా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వ్యక్తిగత శుభ్రత పాటించాలని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు తెలియజేయాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన రోగులకు సూచించారు. వైద్య అధికారులు, డాక్టర్లతో కలిసి అన్ని వార్డులు తిరిగి పరిశుభ్రతకు సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం దవాఖాన సిబ్బందిని హెచ్చరించారు. logo