మంగళవారం 31 మార్చి 2020
National - Mar 06, 2020 , 16:33:19

రైలు కింద నలిగిన బీఎండబ్ల్యూ కారు..వీడియో

రైలు కింద నలిగిన బీఎండబ్ల్యూ కారు..వీడియో

రైల్వే ట్రాక్‌లు దాటేటపుడు రెప్పపాటులో ప్రమాదాలు జరుగడం అప్పడప్పుడు చూస్తుంటాం. తాజాగా లాస్‌ఏంజెల్స్‌లో అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా రైల్వే క్రాసింగ్‌ ట్రాక్‌పై నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంకేముంది రెప్పపాటులోనే అటువైపు నుంచి రైలు వేగంగా వచ్చి బీఎండబ్య్లూ కారును ఈడ్చుకెళ్లింది. అయితే వీడియో చూస్తే కారులో ఉన్నవారి ప్రాణాలు పోయినట్టేననుకుంటారు. కానీ కారు యజమాని తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


లాస్‌ ఏంజెల్స్‌ పోలీసులు ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంత భయంకరమైన ప్రమాదం నుంచి డ్రైవర్‌ ఎలా  బతికి బయటపడ్డాడంటూ ఆశ్చర్యపోతున్నారు. టైం బాగుండి డ్రైవర్‌ బతికి పడ్డాడు. ఈ ఘటన అందరికి ఓ హెచ్చరికలాంటిది. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్లేటపుడు జాగ్రత్తగా ఉండండి. రైల్వే అధికారుల సూచనలు, సిగ్నల్స్‌ను ఫాలో అవ్వండి అని పోలీసులు కోరారు. logo
>>>>>>