ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. ఐదుగురు సజీవ దహనం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కంట్రోల్ కాకపోవడం ట్యాంకర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారు సెంట్రల్ లాక్ కావడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కారు మొత్తం మంటలు వ్యాపించి ఐదుగురు కారులోనే దహనమయ్యారు.
గమనించిన పలువురు పోలీసులు, ఫైర్ అధికారులకు సమాచారం అందించగా.. వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే ఫైరింజన్ వచ్చే సరికే అందులో ప్రయాణిస్తున్న వారంతా కాలిబూడిదయ్యారు. సంఘటన జరిగిన సమయంలో కారులో ఓ మహిళ, చిన్నారి సహా మరో ముగ్గురు వ్యక్తులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆగ్రా జిల్లా అధికారి ప్రభు ఎన్ సింగ్, ఎస్ఎస్సీ బబ్లూ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్ ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగాయని సీఐ ఎట్మాద్పూర్ అర్చన సింగ్ తెలిపారు. చనిపోయిన వారిని గుర్తించలేదని, కారు నంబరు ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించారు. కాగా, ఘటనపై యూపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!