శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 20:59:26

యథావిధిగానే లోక్‌సభ వర్షాకాల సమావేశాలు: స్పీకర్‌

యథావిధిగానే లోక్‌సభ వర్షాకాల సమావేశాలు: స్పీకర్‌

న్యూఢిల్లీ: ఎప్పటిమాదిరిగానే లోక్‌సభ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూన్‌-జూలై నెలల మధ్య జరుగుతాయి. గత వర్షాకాల సమావేశాలు జూన్‌ 20 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగాయి. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అంతా సవ్యంగా సాగితే యథావిధిగానే వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక భౌతిక దూరం పాటించాల్సి వస్తే ఏంచేయాలో అప్పుడే ఒక నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని, ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభానికి ముందే బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 3న ముగియాల్సి ఉండగా.. మార్చి 23 నే వాయిదా పడ్డాయి.


logo