గురువారం 02 జూలై 2020
National - Jun 26, 2020 , 09:07:43

పెట్స్‌ను ప్రేమిస్తారు కాని.. మ‌రీ ఇంత‌లా అనుకోలేదు!

పెట్స్‌ను ప్రేమిస్తారు కాని.. మ‌రీ ఇంత‌లా అనుకోలేదు!

ఈ రోజుల్లో మ‌నుషుల కంటే కుక్క‌లే ఎంతో బెట‌ర్‌.  ఒక‌సారి య‌జ‌మానిని న‌మ్మాయంటే చ‌చ్చేంత‌వ‌ర‌కు ఎంతో న‌మ్మ‌కంగా ఉంటుంది. మ‌రి అలాంటి పెట్‌కు ఆరోగ్యం బాగోలేక‌పోతే య‌జ‌మాని ఊరుకుంటారా?  దాని క్షేమం కోసం ఏమైనా చేస్తారు. అందులో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ స్లైడ్ కూడా ఒక‌టి. ఏంటీ ఈ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ అనుకుంటున్నారా!

ఓ పెంపుడు కుక్క కీళ్ల నొప్పుల‌తో కొన్నిరోజులుగా బాధ‌ప‌డుతున్న‌ది. ఇంట్లోని మెట్లు కూడా ఎక్క‌లేని ప‌రిస్థితి. లిప్ట్ పెట్టించ‌డానికి వీలు లేదు. నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న పెట్‌కు వైద్యం కూడా ఇప్పించారు. అయినా కీళ్ళ‌నొప్పులు అనేవి పోవు క‌దా. అందుకు వినూత్న ఐడియాతో మెట్లు ఎక్క‌డానికి దిగ‌డానికి చాలా ఈజీగా ఉండేలా డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ స్టైడ్‌ను సృష్టించారు య‌జ‌మాని. ఇది జారుడు బండ ఆట‌లా ఉండ‌డంతో పెట్‌కు భ‌లే న‌చ్చేసింది. అప్ప‌టి నుంచి ఎంతో హుషారుగా పైకి కింద‌కి దిగుతూ హ్యాపీగా తిరుగుతున్న‌ది‌. పెట్ సంతోషంగా ఉంటే ఇంట్లో వాళ్లంతా కూడా ఆనందంగా ఉంటారు. ఈ వీడియోను అమెరిక‌న్  బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు. పెట్స్‌ను ప్రేమిస్తారు కాని మ‌రీ ఇంత‌లా అనుకోలేదు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo