మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 18:50:39

హాంగ్ కాంగ్‌కు ఈ నెల 4 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు

హాంగ్ కాంగ్‌కు ఈ నెల 4 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు

న్యూఢిల్లీ: ఈ నెల 4 నుంచి ఢిల్లీ-హాంగ్ కాంగ్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సెప్టెంబర్ 21న ఢిల్లీ-హాంగ్ కాంగ్ విమాన సర్వీసును రద్దు చేశారు. అక్టోబర్ 3 వరకు ఆ దేశానికి విమాన ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించారు. శనివారంతో ఇది ముగియనున్నది. దీంతో ఆదివారం నుంచి ఢిల్లీ-హాంగ్ కాంగ్ మధ్య ఎయిర్ ఇండియా విమానాలు నడుస్తాయని ఆ సంస్థ గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 21న రద్దైన ప్రయాణాన్ని అక్టోబర్ 4న వినియోగించుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని ట్విట్టర్‌లో పేర్కొంది. మిగతా సీట్ల కోసం ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, బుకింగ్ కార్యాలయాలు, కాల్ సెంటర్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది.


కాగా, ఢిల్లీ-హాంగ్ కాంగ్‌కు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించిన 14 మంది ప్రయాణికులకు ఆగస్టు 14న కరోనా సోకింది. దీంతో ఆగస్టు 18 నుంచి 31 వరకు కూడా హాంగ్ కాంగ్‌కు ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo