శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 03, 2020 , 12:37:31

కుక్క ఆనందం వర్ణనాతీతం.. ఎందుకోతెలుసా?

కుక్క ఆనందం వర్ణనాతీతం.. ఎందుకోతెలుసా?

విశ్వాసానికి మారు పేరు ఎవ‌రంటే.. శున‌కం అని క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా చెప్పేస్తారు. కుక్క‌ను య‌జ‌మాని ప్రేమ‌గా చూసుకుంటే చాలు ప్రాణాల‌ను సైతం ప‌నంగా పెట్టేందుకు సిద్ధ‌ప‌డుతుంది. మ‌రి అలాంటి య‌జ‌మాని కొన్నిరోజులుగా క‌నిపించ‌కుండా పోతే  ఆ కుక్క మ‌న‌సు ఎంత విల‌విల్లాడి పోయింటుందో.. ఆ ప్రేమ‌, బాధ‌ను మాట‌ల్లో వివ‌రించ‌డం క‌ష్టం. ఈ వీడియో చూస్తే చాలు.

నిరాశ్ర‌యులైన వ్య‌క్తి త‌న పెంపుడు కుక్క‌తో ఒక ఇంటి వ‌ద్ద తిరిగి క‌లుసుకున్నాడు. దీంతో ఆ కుక్క ఆనందం వ‌ర్ణ‌ణాతీతం. 24 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా కాసేప‌టికే వైర‌ల్‌గా మారింది. కుక్క య‌జ‌మానిపై దూకి ఆలింగ‌నం చేసుకునే విధానానికి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. అప్యాయ‌త‌కు స‌రిహ‌ద్దులు లేవు అని ఒక వినియోగ‌దారుడు కామెంట్ పెట్టారు.