శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 15:02:09

ఇకపై హోం క్వారంటైన్‌ వారం రోజులు మాత్రమే.!

ఇకపై హోం క్వారంటైన్‌ వారం రోజులు మాత్రమే.!

గువహాటి : కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఆసోం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు  డిశ్చార్జ్ అయిన తరువాత ఇకపై వారం రోజుల హోం క్వారంటైన్‌లో ఉంటే చాలని ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 14 రోజులుగా ఉన్న హోం క్వారంటైన్ గడువును ప్రస్తుతం ఏడు రోజులకు కుదించింది అక్కడి ప్రభుత్వం. అయితే డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న రూ. రెండు వేల విలువైన అత్యవసర వస్తువుల పంపిణీ కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

సందర్భాన్ని బట్టి వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘరోగ వ్యాధిగ్రస్తులకూ ఈ సౌలభ్యాన్ని వర్తింపజేసేందుకు డిప్యుటీ కమిషనర్‌కు అధికారాలు ఇస్తున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది. తాజాగా  అసోంలో ఇప్పటివరకూ 29,921 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 20,699 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లాగా.. 9,143 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo