మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 19:40:04

ఈ మంత్రి మాస్కే సెపరేటు!

ఈ మంత్రి మాస్కే సెపరేటు!

భోపాల్ : కరోనా వైరస్ కట్టడికి మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం ఇప్పుడు అనివార్యమైంది. ముఖానికి ధరించే మాస్కులు రోజుకో వెరైటీ మార్కెట్లోకి వస్తుండగా.. వజ్రాలు పొదిగిన మాస్కులను కూడా అమ్మకానికి పెట్టారు. అయితే, మాస్కులు పెట్టుకోవడం వల్ల ఎదుటివారిని గుర్తించడం కొంచెం కష్టంగా మారింది. దీంతో మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది.

తన ముఖానికి సరిపోయేలా ముక్కు, మీసాలు, పెదవులు సరిగ్గా అతికేలా ఉండేలా మాస్కులను తయారుచేయించారు. మాస్కు రంగు కూడా తన చర్మం రంగులో ఉండేలా చూసుకున్నారు. ఇంకేం ఈయన మాస్కు పెట్టుకున్నా లేనట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ముక్కు, పెదవులు, మీసాలు అన్ని కనిపిస్తాయి కాబట్టి. ఈయన ఎక్కడికి వెళ్లినా ఆయనను కలువడం కన్నా ఆయన ధరించే మాస్కును చూసేందుకే కార్యకర్తలు ఎగబడుతున్నారు. సోమవారం నాడు తన సొంతూరుకు వచ్చిన నరొత్తం మిశ్రాకు కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రావడంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నరోత్తం మిశ్రా గత నెలలోనే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


logo