సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 01:42:02

హోం ఐసొలేషన్‌.. కొత్త మార్గదర్శకాలు

హోం ఐసొలేషన్‌..   కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 రోగులకు హోం ఐసొలేషన్‌ విధించటంపై కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

నూతన మార్గదర్శకాలు

  • హెచ్‌ఐవీ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, క్యాన్సర్‌ థెరపీ చేయించుకుంటున్నవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచరాదు.
  • 60 ఏండ్లకు పైబడి, వ్యాధులున్నవారిని హోం ఐసొలేషన్‌కు పంపాలంటే మెడికల్‌ ఆఫీసర్‌ పరిశీలించి సిఫారసు చేయాలి.
  • ఒక కరోనా రోగిని దవాఖానలో ఉంచి వైద్యం అందించాల్సిన అవసరం లేదని ఆ రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్‌ సిఫారసు చేస్తేనే హోం ఐసొలేషన్‌కు తరలించాలి.
  • ఐసోలేషన్‌లో ఉన్న రోగికి పదిరోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపించకుంటే వ్యాధి నయమైందని భావించాలి. అయినా  7 రోజులు ఐసొలేషన్‌లోనే ఉండాలి.
  • ప్రతి రోగికి అందిస్తున్న వైద్యసేవల వివరాలను ఆరోగ్య కార్యకర్తలు క్రమంతప్పకుండా రికార్డు చేయాలి.
  • హోం ఐసొలేషన్‌లో ఉన్న రోగి కుటుంబసభ్యులకు, ప్రైమరీ కాంటాక్టులకు కరోనా టెస్టులు తప్పనిసరిగా చేయాలి.
  • హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిని దవాఖానకు తరలించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. 


logo