బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 15:42:30

శ్రీశైలం పాతాళగంగలో స్నానాలు రద్దు

శ్రీశైలం పాతాళగంగలో స్నానాలు రద్దు

హైదరాబాద్‌ : కరోనా ప్రభావం ఇరు తెలుగు రాష్ర్టాల్లోని దేవస్థానాలపై కూడా పడుతున్న విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో గంటకు నాలుగు వేల మంది భక్తులను మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం సైతం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలకు ఉపక్రమించింది. నేటి నుంచి శ్రీశైలంలోని పాతళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం వెలువరించారు. అంతేకాకుండా భక్తులు దర్శనానికి రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని స్క్రీనింగ్‌ చేశాకే ఆలయంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.


logo
>>>>>>