శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 18:34:44

పంజాబ్‌లో ‘హోలా మొహల్లా’ పోటీలు..వీడియో

పంజాబ్‌లో ‘హోలా మొహల్లా’ పోటీలు..వీడియో

పంజాబ్‌: హోలీ వేడుకల్లో భాగంగా పంజాబ్‌లో ఏటా నిర్వహించే ‘హోలా మొహల్లా’ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. అనంద్‌పూర్‌ సాహిబ్‌లో హోలా మొహల్లా లో భాగంగా గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించారు. గుర్రపు స్వారీ పోటీలను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పంజాబ్ లో హోలీ వేడుకలను హోలా మొహల్లా పండుగగా జరుపుకుంటారు. సిక్కు పురుషులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి గుర్రాలపై స్వారీ చేస్తారు. పురాతన కాలం నాటి యుద్ధకళలను ప్రదర్శిస్తారు. హోలీ మరుసటి నిర్వహించే ఈ కార్యక్రమం మూడు రోజులపాటు ఘనంగా కొనసాగుతోంది. logo