శనివారం 06 జూన్ 2020
National - May 20, 2020 , 19:36:12

టోల్‌గోట్‌ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలి: హెచ్‌ఎండీఏ

టోల్‌గోట్‌ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలి: హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై టోల్‌గేట్‌ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్‌ఎండీఏ తెలిపింది లాక్‌డౌన్‌ దృష్ట్యా అత్వవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేది. కేంద్రం మార్గదర్శకాలకు లోబడి నిర్ణయం తీసుకున్నాం. ఓఆర్‌ఆర్‌ సిబ్బంది వీలైనంత వరకు డిజిటల్‌ విధానంలో లావాదేవీలు జరుపాలని హెచ్‌ఎండీఏ సూచించింది.

కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి లేదు. సరుకులు రవాణా చేసే వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లుగా గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రజలకు సూచనలు చేసింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo