బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 20:46:23

జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాది అరెస్ట్‌

జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాది అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం దోడా జిల్లాలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది రఖీబ్‌ ఆలంను భద్రతా బలగాలు అరెస్ట్‌ చేశాయి. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భారత ఆర్మీ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో 22 ఏండ్ల రఖీబ్‌ పట్టుబడ్డాడు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూను హతమార్చిన మరుసటి రోజే రఖీబ్‌ సెక్యూరిటీ సిబ్బందికి చిక్కాడు. అతని నుంచి పోలీసులు ఒక పిస్తోల్‌ను, వైర్‌లెస్‌ సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పట్టుబడ్డ హిజ్బుల్‌ ఉగ్రవాది తన్వీర్‌ అహ్మద్‌ను ఇంటరాగేట్‌ చేయడంతో రఖీబ్‌ ఆలం జాడ దొరికిందని పోలీసులు తెలిపారు.


logo