సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 07:30:03

హిజ్జూల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌చ‌ర్య బ‌హిర్గ‌తం.. ముగ్గురు అరెస్టు

హిజ్జూల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌చ‌ర్య బ‌హిర్గ‌తం.. ముగ్గురు అరెస్టు

శ్రీ‌న‌గ‌ర్ : భ‌ద్ర‌తా ద‌ళాల సిబ్బంది సోమ‌వారం నాడు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌చ‌ర్య‌ను ఛేదించారు. దీంతోపాటు ఉగ్ర‌వాద స‌హ‌చ‌రుల‌ను ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు బుద్గాం పోల‌స్‌, ఆర్మీ 53 ఆర్ఆర్‌, 181 సీఆర్‌పీఎఫ్ బెటాలియ‌న్ సంయ‌క్త ఆప‌రేష‌న్‌ను చేపట్టారు. ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన త‌నిఖీల్లో పాకేర్‌పోరా ప్రాంతం నుంచి ముగ్గురు ఉగ్ర‌వాద అనుచ‌రుల‌ను అరెస్టు చేశారు. 

అరెస్టైన వ్య‌క్తుల‌ను మెహర్జ‌దిన్ కుమార్‌, తాహిర్ కుమార్, సాహిల్ హుర్రాగా గుర్తించారు. మెహర్జ‌దిన్ కుమార్‌, తాహిర్ కుమార్ పాకేర్‌పోరాకు చెందినవారు కాగా సాహిల్ హుర్రా తిల్సరకు నివాసి. నిందితుల వ‌ద్ద నుండి 20 లైవ్ రౌండ్ల ఎకె -47, రెండు డిటోనేటర్లు, నిషేధిత టెర్రర్ గ్రూప్ హిజ్బుల్ 15 పోస్టర్లతో సహా ప‌లు పేలుడు ప‌దార్థాల‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నిందితుల‌పై ఉపా సంబంధిత చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేశారు.


logo