శనివారం 11 జూలై 2020
National - Jun 29, 2020 , 10:03:07

హిజ్బుల్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ హ‌తం

హిజ్బుల్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ హ‌తం

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు హిజ్బుల్ ముజాహిదిన్ క‌మాండ‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్ భ‌ట్‌ను హ‌త‌మార్చాయి.  ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో ఇవాళ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో అహ్మ‌ద్ భ‌ట్‌తో పాటు మ‌రో ఇద్ద‌ర్ని హ‌త‌మార్చారు. దీంతో దోడా జిల్లా ఇక ఉగ్ర‌వాద విముక్త జిల్లాగా మారిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఆర్మీ, జేకే పోలీస్‌, సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఎన్‌కౌంట‌ర్ ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్‌, రెండు పిస్తోళ్లు రిక‌వ‌ర్ చేశారు. 

హిజ్బుల్ క‌మాండ‌ర్ అహ్మద్ భ‌ట్‌తో పాటు ఇద్దు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్  సింగ్ మీడియాతో తెలిపారు. మ‌సూద్ ఓ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.  దోడా పోలిస్ స్టేష‌న్‌లో అత‌నిపై కేసు ఉన్న‌ది. అప్ప‌టి నుంచి అత‌ను ప‌రారీలో ఉన్నాడు.   కోక‌ర్‌నాగ్‌, త్రాల్‌, క్రీవ్ ప్రాంతాల్లో ఉన్న 29 మంది విదేశీ ఉగ్ర‌వాదుల‌ను త్వ‌ర‌లోనే హ‌త‌మార్చ‌నున్న‌ట్లు ఐజీ విజ‌య్‌కుమార్ తెలిపారు.  

ద‌క్షిణ క‌శ్మీర్ నుంచి ఉగ్ర‌వాదాన్ని తరిమివేయాల‌న్న దీక్ష‌తో భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌నిచేస్తున్నాయి.  త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర‌వాదుల‌ను హ‌తమార్చ‌డంతో ఆ ప్రాంతం విముక్తి అయిన‌ట్లు పోలీసులు చెప్పారు.  ఈ ఏడాది ఇప్ప‌టి వంద క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఇటీవ‌ల హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.  logo