శనివారం 28 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 17:16:53

20న నీలిరంగులో కనిపించనున్న చారిత్రక కట్టడాలు

20న నీలిరంగులో కనిపించనున్న చారిత్రక కట్టడాలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌తో పాటు కుతుబ్‌ మినార్‌తో సహా ఇతర స్మారక కట్టడాలు, చిహ్నాలు ఈ నెల 20న ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా నీలిరంగుల్లో కనిపిస్తాయని యూనిసెఫ్‌ ఆదివారం తెలిపింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కార్యకలాపాలు వర్చువల్‌, డిజిటల్‌ పద్ధతుల్లో జరుగుతాయని చెప్పింది. కార్యక్రమాల్లో పాల్గొనే చిన్నారులతో పాటు పెద్దలూ మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటిస్తారని చెప్పింది. పార్లమెంటేరియన్‌ గ్రూప్‌ ఫర్‌ చిల్డ్రన్‌ (పీజీసీ) భాగస్వామ్యంతో యూనిసెఫ్‌ 20న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 30 మంది ఎంపీలు, చిన్నారులతో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసింది.


‘వాతావరణ మార్పుల ప్రభావంపై పిల్లలు చట్టసభ్యులతో చర్చిస్తారని, వాతావరణ చర్యలపై పలు చార్ట్‌ ఆఫ్‌ డిమాండ్లను సమర్పిస్తారని, అలాగే ఎంపీలు వాతావరణ చర్య, అనుసరణ ప్రణాళికలను పిల్లల హక్కులు, స్వరాలను ఏకీకృతం చేయడానికి అవసరమైన మద్దతు ఇవ్వడానికి నిబద్ధత లేఖపై సంతకం చేయాలని భావిస్తున్నారు’ తెలిపింది. గో బ్లూ20లో భాగంగా పిల్లల హక్కుల కోసం సంఘీభావంగా నిలిచేందుకు, కొవిడ్‌ 19 ప్రభావం, జీవితాలపై వాతావరణ మార్పులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలైన రాష్ట్రపతి భవన్‌, ప్రధానమంత్రి కార్యాలయం, న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌, కుతుబ్‌మినార్‌, ఇతర చారిత్రక భవనాలు, ప్రభుత్వ భవనాలు బ్లూ కలర్‌లో అలంకరించనున్నట్లు యూనిసెఫ్‌ తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.