బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 17:05:19

కరోనాతో చరిత్రకారుడు మృతి

 కరోనాతో చరిత్రకారుడు మృతి

కోల్‌కతా: ప్రముఖ చరిత్రకారుడు, ఎమిరటస్‌ ప్రొఫెసర్‌ హరి వాసుదేవన్‌ (68) ఆదివారం కన్నుమూశారు. కరోనా వైరస్‌కు గురైన హరి వాసుదేవన్‌ ఈ నెల 4 వ తేదీ నుంచి కోల్‌కతాలోని ఒక ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జ్వరం పెరిగిపోయి శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొని చివరకు తుదిశ్వాస విడిచారు. హరి వాసుదేవన్‌కు భార్య, కూతురు ఉన్నారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. కాంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టోరల్‌ పట్టా అందుకొన్న వాసుదేవన్‌.. యూరప్‌, రష్యా చరిత్ర, రాజకీయాలపై మంచి పట్టు కలిగివున్నారు. కోల్‌కతా విశ్వవిద్యాలయంతోపాటు, జామియా మిలియా ఇస్తామియా, లండన్‌ కింగ్స్‌ కాలేజీలో విజిటింగ్‌  ప్రొఫెసర్‌గా వాసుదేవన్‌ పాఠాలు చెప్పారు. హరి వాసుదేవన్‌ మృతిపట్ల పశ్చిమ  బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధంకర్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలాకాలంపాటు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏసియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా సేవలందించారు.


logo