శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 08:39:56

10 ఫ‌లితాల్లో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

10 ఫ‌లితాల్లో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

న్యూఢిల్లీ : హ‌ర్యానా రాష్ర్టంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫ‌లితాల్లో హిసార్ జిల్లాకు చెందిన రిషిత అనే విద్యార్థిని 100 శాతం మార్కులు సాధించింది. ఇంగ్లీష్, గ‌ణితం, సామాన్య‌, సాంఘిక శాస్ర్త‌ల‌తో పాటు ఎంహెచ్వీ లో 100 శాతం మార్కులు సాధించి ప‌లువురితో ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ విద్యార్థిని ఠాగూర్ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ కు చెందిన అమ్మాయి. ఉమా, స్నేహ్, క‌ల్ప‌న అనే విద్యార్థినులు కూడా 99.8 శాతం మార్కులు సాధించారు. 

హ‌ర్యానా ప‌ది ప‌రీక్ష‌ల‌కు మొత్తం 3,37,691 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 64.59 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. బాలిక‌లు 69.86 శాతం, బాలురు 60.27 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. 


logo