ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:47:44

గుండు గీసి.. జైశ్రీరాం అని రాసి..

గుండు గీసి.. జైశ్రీరాం అని రాసి..

యూపీలో నేపాలీపై దాడి

లక్నో, జూన్‌ 17: శ్రీరాముడు తమవాడేనంటూ నేపాల్‌ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తిపై యూపీలో దౌర్జన్యం జరిగింది. నేపాల్‌ పౌరుడిపై విశ్వహిందూ సేన అనే సంస్థకు చెందిన అరుణ్‌ పాఠక్‌ దాడి చేసి గుండు గీయించాడు. మార్కర్‌తో గుండుపై జైశ్రీరాం అని రాశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నేపాల్‌ స్పందించింది. భారత్‌లోని నేపాల్‌ రాయబారి నీలాంబర్‌ ఆచార్య ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు.  స్పందించిన ఆదిత్యనాథ్‌ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. 


logo