శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 02:21:55

వెల్లివిరిసిన మత సామరస్యం!

వెల్లివిరిసిన మత సామరస్యం!

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ మత హింసతో అల్లకల్లోలమైనా ఓ కాలనీ మాత్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. యమునా విహార్‌లోని బీ-బ్లాక్‌ కాలనీలో ఒకవైపు హిందువులు, మరొకవైపు ముస్లింలు జీవిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మూకల స్వైర విహారంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. ఈ కాలనీలోని హిందువులు, ముస్లింలు, సిక్కులు రాత్రి వేళ తమ ఇండ్లకు రక్షణగా నిలిచారు. బయటి వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినా అప్రమత్తమయ్యారు. సోమ, మంగళవారాల్లో 24 గంటలపాటు తమ కాలనీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రస్తుతం పోలీసుల భద్రత పెరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


logo