మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 14:20:53

హిందూ-ముస్లిం భాయ్‌ భాయ్‌ : మమతా బెనర్జీ

హిందూ-ముస్లిం భాయ్‌ భాయ్‌ : మమతా బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ భారతదేశం వైవిధ్యంలో శతాబ్దాల పురాతన వారసత్వం అని చివరి శ్వాస వరకు మనం దాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో హిందూ-ముస్లింలు అందరూ సోదరులే అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 'హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఒకరికొకరు సోదరులే.. నా భారతదేశం గొప్పది.. మన దేశం గొప్పది' అని ఆమె ట్వీట్ చేశారు. 'మన దేశం శతాబ్దాల నాటి వైవిధ్యంలో ఐక్యత వారసత్వాన్ని పరిరక్షించింది. చివరి శ్వాస వరకు ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి' అని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

మమతా బెనర్జీ దేశ రాజ్యాంగ విలువలపై ఎల్లప్పుడూ చర్చిస్తూనే ఉంటారు. 'జై శ్రీ రామ్' నినాదంపై బీజేపీతో జరిగిన గొడవపై మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘త్యాగం హిందూ పేరు, విశ్వాసం ముస్లిం పేరు, ప్రేమ క్రిస్టియన్ పేరు, సిక్కుల పేరు త్యాగం’ అని మమతా అన్నారు. ఇది మన ప్రియమైన భారతదేశం.. మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తాం అన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo