ఆదివారం 05 జూలై 2020
National - Jun 14, 2020 , 19:00:56

ఆరోగ్య శాఖ మంత్రి కిడ్నీలో రాయి.. వైద్య పరీక్షలో నిర్ధారణ

ఆరోగ్య శాఖ మంత్రి కిడ్నీలో రాయి.. వైద్య పరీక్షలో నిర్ధారణ

గౌహతి: అసోం రాష్ట్రానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ కిడ్నీలో రాయి ఉన్నది.  ఆదివారం నిర్వహించిన వైద్య పరీక్షల ద్వారా ఈ విషయం నిర్ధారణ అయ్యింది. కడుపులో నొప్పిగా ఉండటంతో గౌహతిలోని దవాఖానకు ఆయన వెళ్లారు. అల్ట్రా సోనో గ్రఫీ ద్వారా పరీక్షించిన వైద్యులు మంత్రి హిమంత కిడ్నీలో 3.76 మిల్లీమీటర్ల మేర ఓ రాయి ఉన్నట్లు గుర్తించారు. నొప్పి తగ్గేందుకు ఇంజక్షన్లు ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. అసోంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ మంత్రి అయిన హిమంత  బిశ్వా శర్మ రోజూ పలు దవాఖానలు, క్వారంటైన్‌ కేంద్రాలను సందర్శిస్తూ బిజీగా ఉన్నారు. logo