గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 20:47:32

హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్తగా 955 కరోనా కేసులు

హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్తగా 955 కరోనా కేసులు

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 955 మంది వైరస్ బారినపడిగా మొత్తం కేసులు సంఖ్య 2,187కి చేరింది. వీరిలో 1,203 మంది చికిత్స తీసుకొని కోలుకోగా 12 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్‌కు సుమారు 15 మంది కరోనా రోగులు వలస వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా దేశంలో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 14 లక్షలను దాటింది.  9,17,568 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 4,85,114 వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 32,771 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య  సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 49,931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 708 మృతి చెందారు.


logo