శనివారం 04 జూలై 2020
National - May 29, 2020 , 09:29:02

పలు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన హిమాచల్‌

పలు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన హిమాచల్‌

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. కంగ్రా, ఉనా, బిలాస్‌పూర్‌, సోలన్‌ జిల్లాలోని పంట పొలాలపై మిడతల దండు దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇది రాష్ట్రంలోని మరిన్ని జిల్లాలకు వ్యాపించే ఆస్కారం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆయా జిల్లాలో హై అలర్ట్‌ను ప్రకటించినట్లు వ్యవసాయశాఖ డైరక్టర్‌ డా.ఆర్‌కే కౌండల్‌ తెలిపారు. మిడతల సంచారంపై క్షేత్రస్థాయిలోని సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు వెలువరించే అత్యవసరాదేశాలను తక్షణం అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా సూచించారు. గాలి తీవ్రతను అనుసరించి మిడతలు గంటలకు 16 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మిడతలు ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో వాలినప్పుడు తక్షణం రసాయనాలను స్ప్రే చేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.


logo