బుధవారం 25 నవంబర్ 2020
National - Sep 24, 2020 , 13:33:30

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైద‌రాబాద్‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేసుకున్నారు.  గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్ చేశారు. ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ది. ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సుక్రామ్ చౌద‌రీ, జ‌ల‌శ‌క్తి మంత్రి మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌లు పాజిటివ్‌గా తేలారు. అయితే ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం కోలుకున్నారు. సురేంద‌ర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే రాకేశ్ జామ్వాల్‌, నాచ‌న్ ఎమ్మెల్యే వినోద్ కుమార్‌లు కూడా క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం మండి జిల్లాలోని కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు.హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 12,899కి చేరుకున్న‌ది.