గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 19:45:50

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భారీగా పెరిగిన బ‌స్సు చార్జీలు

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భారీగా పెరిగిన బ‌స్సు చార్జీలు

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏప్రిల్‌, మే నెలల్లో బ‌స్సు స‌ర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్ర‌జా ర‌వాణా సంస్థ‌లు న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు ఒక్కో రాష్ట్రం చార్జీల పెంపు బాట ప‌డుతున్నాయి. తాజాగా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ కూడా అదే బాట‌ను ఎంచుకుంది.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ర‌వాణా సంస్థ‌ బ‌స్సుల‌ చార్జీల‌ను భారీగా పెంచింది. గ‌తంలో మొద‌టి మూడు కిలోమీట‌ర్ల‌కు రూ.5 క‌నీస చార్జీ ఉండ‌గా ఇప్పుడు దాన్ని రూ.7కు పెంచింది. అదేవిధంగా మూడు కిలీమీట‌ర్ల త‌ర్వాత ప్ర‌తి కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి 25 శాతం చొప్పున చార్జీల‌ను పెంపు చేసింది. దీంతో ప్ర‌జ‌ల‌పై భారీగా భారం ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం రూ.100 చార్జీ చెల్లించే దూరానికి రూ.125 చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.    


logo