శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:56:57

స్వీయ క్వారంటైన్‌లో.. హిమాచల్ ప్రదేశ్ సీఎం

స్వీయ క్వారంటైన్‌లో.. హిమాచల్ ప్రదేశ్ సీఎం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై‌రామ్ ఠాకూర్ స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు. సీఎం కార్యాలయంలోని డిప్యూటీ కార్యదర్శికి కరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనల మేరకు తన అధికార నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు జై‌రామ్ ఠాకూర్ చెప్పారు. మరోవైపు సీఎం అధికార కార్యక్రమాలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా, జైరామ్ ఠాకూర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్ష జరుపుతామని వైద్య అధికారి తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం డిప్యూటీ కార్యదర్శిని కలిసిన అధికారులు, మీడియా సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామన్నారు. అలాగే వారందరి నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.logo