గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:07:39

క్వారంటైన్‌కు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌

క్వారంటైన్‌కు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ స్వచ్ఛంద గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం సాయంత్రం ధ్రువీకరించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారికి కరోనా వైరస్‌ పాజిటివ్ పరీక్షలు జరిపిన తరువాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్వచ్ఛంద నిర్బంధంలోకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

కాగా, మండిలో 75 ఏండ్ల మహిళ మరణించిన తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య మంగళవారం 11 కి పెరిగింది. కొండ రాష్ట్రంలో నిన్న మొత్తం 33 తాజా కొవిడ్‌-19 కేసులు బయటపడ్డాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 1,665 కు చేరింది. 

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం 560 పాజిటివ్ కేసులు ఉన్నాయి. హిమాచల్‌లోని సోలన్ జిల్లాలో అత్యధికంగా 381 కేసులు నమోదయ్యాయి. వీరిలో 159 మంది రోగులు వలస కార్మికులు అని, ఇప్పటివరకు 1,077 మంది కోలుకున్నారని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్డీ ధీమాన్ తెలిపారు. కాగా, సోలన్ జిల్లా పరిధిలోని బడ్డి ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఢిల్లీకి చెందిన 70 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె ఏప్రిల్‌ నెలలో చండీగఢ్‌‌లోని పీజీఐఎంఈఆర్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.logo