సోమవారం 13 జూలై 2020
National - Jun 17, 2020 , 20:00:42

జ‌వాన్ అంకుశ్ ఠాకూర్ త్యాగం మ‌రువ‌లేనిది: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం

జ‌వాన్ అంకుశ్ ఠాకూర్ త్యాగం మ‌రువ‌లేనిది: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం

న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వన్ లోయలో భార‌త్‌- చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జైరామ్ ఠాకూర్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ వాసి, పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన సిపాయి అంకుశ్ ఠాకూర్‌ వీర మరణం పొందాడని, ఆయ‌న మ‌ర‌ణం వృథా కాబోద‌ని జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు. 

ఈ నెల 15, 16 తేదీల్లో అర్థ‌రాత్రి చైనా సైనికులు విచక్షణారహితంగా దాడి చేయడంతో 20 మంది భారత సైనికులు అమరుల‌య్యారు. అంకుశ్ ఠాకూర్ హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా, కరోహ్తా గ్రామస్థుడు. కాగా, అంకుశ్ ఠాకూర్ మృతికి హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ సీఎం జైరామ్ ఠాకూర్ సంతాపం వ్య‌క్తంచేశారు. ఆయ‌న‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంకుశ్ దేశ సరిహద్దులను కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన త్యాగం ఎల్లప్పుడూ గుర్తుంటుందని ఆయ‌న పేర్కొన్నారు.


logo