మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:23:03

చిరుత‌పులి వెయిట్ లిఫ్టింగ్‌.. ఎన్ని క‌ష్టాలు ప‌డుతుందో!

చిరుత‌పులి వెయిట్ లిఫ్టింగ్‌.. ఎన్ని క‌ష్టాలు ప‌డుతుందో!

ప‌ట్టుద‌ల‌తో ఏం చేసినా సాధించి తీరుతారు. క‌ష్ట‌ప‌డుతున్నాం క‌దా అని ప్ర‌తిఫ‌లం వెంట‌నే రాదు. చేసే ప‌ని క‌రెక్టుగా చేస్తున్నామో లేదో కూడా చూసుకోవాలి. వ్రాంగ్ ప‌ద్ద‌తిలో చేసి సాధించ‌లేక‌పోయాం అని నిరుత్సాహ‌ప‌డ‌కూడ‌దు. ఇదిగో ఈ చిరుత‌లా మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తూ ఉండాలి. 37 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో చిరుత వెయిట్‌లిఫ్టింగ్ చేస్తున్న‌ది. త‌న స్థావ‌రం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బ‌య‌ట ఉన్న క‌ర్ర‌ను చేతిలో ప‌ట్టుకొని లోప‌లికి తీసుకెళ్లాల‌నుకున్న‌ది.

క‌ర్ర ఏమో పెద్ద‌గా ఉంది. స్థావ‌రం వెడ‌ల్పు ఏమో చిన్న‌గా ఉంది. దాన్ని నిలువుగానే లేదంటే స‌గానికి విర‌గొట్టో లోప‌లికి తీసుకెళ్లాలి. ఆ విష‌యం పాపం ఈ చిరుత‌కి ఏం తెలుసు. చేతులు, నోటితో ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా లోప‌లికి మాత్రం తీసుకెళ్ల‌లేక‌పోయింది. అయితేనేం! వెయిట్ లిఫ్టింగ్ మాత్రం భ‌లే చేసింది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. క్యూరియోసిటీకి చిక‌త్స‌లేదు అనే శీర్షిక‌ను జోడించారు. ఫ‌న్నీగా ఉన్న ఈ వీడియోకు నెటిజ‌న్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 


logo