మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 19:10:31

ధ్యానంలో విశ్వామిత్రున్ని మించిపోయిన కోతి.. ఇది ధ్యానం కాదు నిద్ర‌!

ధ్యానంలో విశ్వామిత్రున్ని మించిపోయిన కోతి.. ఇది ధ్యానం కాదు నిద్ర‌!

చ‌ల్ల‌ని గాలినిచ్చే చెట్టు కింద కూర్చుని 10 నిమిషాలపాటు ఎవ‌రితో మాట్లాడ‌కుండా ఉంటే చాలు నిద్ర‌లోకి జారుకుంటాం. కూర్చుని ఉంటాం కాబ‌ట్టి తూగుతూ కింద‌ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. ఇలాంటి సంఘ‌ట‌న చాలామందికే ఎదురై ఉంటుంది. అలా ఓ కోతి గాఢ నిద్ర‌లోకి జారుకున్న‌ది. అక‌స్మాత్తుగా కుదుపుతో మేల్కొన్న‌ది. చాలామంది ఈ కోతిని చూసి ధ్యానంలో ఉంద‌ని అనుకున్నారు. మ‌రికొంత‌మందైతే ధ్యానంలో విశ్వామిత్రున్ని మించిపోయింది అంటున్నారు.

14 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో కోతి చెట్టు కింద కూర్చొని క‌ళ్లు మూసుకున్నట్లు క‌నిపిస్తుంది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుధా రామెన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'మీరు దీన్ని చేసి, ఈ వీడియోతో సంబంధం కలిగి ఉంటే.. చివరి వరకు చూడండి'‌ అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకున్న‌ది. కొంత‌మంది నెటిజ‌న్లు త‌మ జీవితంలో జ‌రిగిన ఇలాంటి సంఘ‌ట‌ను కామెంట్ల ద్వారా పంచుకుంటున్నారు. 


logo